Friday, May 3, 2024

కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు

- Advertisement -
- Advertisement -
No one can escape from karma Says Rahul Gandhi
రాఫెల్ ఒప్పందంపై రాహుల్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతి మనిషి చేసే చర్యల చిట్టానే కర్మగా ఆయన అభివర్ణిస్తూ దీన్నుంచి ఎవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి రాఫెల్ తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ భారత్‌లోని ఒక మధ్యవర్తికి 11 లక్షల యూరోలు చెల్లించినట్లు ఫ్రెంచ్ మీడియా వెల్లడించగా ఇవి నిరాధార ఆరోపణలంటూ బిజెపి కొట్టివేసిందని రాహుల్ పేర్కొన్నారు. ప్రతి మనిషి చర్యల చిట్టా= కర్మ..దీన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు అంటూ ఆయనఆయన ఇంగ్లీష్, హిందీ భాషలలో ట్వీట్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని రాహుల్ ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఫ్రెంచ్ మీడియా ప్రచురించిన వార్తతో రాహుల్ పదేపదే చేసిన ఆరోపణలు నిజమని ఇప్పుడు నిర్ధారణైందని కాంగ్రెస్ పేర్కొంది. రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన నినాదంగా చేసుకున్నప్పటికీ ఆ పార్టీ ఓటమిని చవిచూసింది.

No one can escape from karma Says Rahul Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News