Sunday, April 28, 2024

తొలి‘సారి’ క్షమించాం..మరోసారి శిక్షే

- Advertisement -
- Advertisement -

150మంది పోకిరీలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్
మహిళా భద్రతా విభాగం ఎడిజిపి స్వాతిలక్రా

No sexual harassment in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్‌: మహిళలపై వేధింపులకు పాల్పడిన 150 మందిని తొలిసారి క్షమిస్తున్నామని, మరోసారి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన శిక్షలు తప్పవని ఎడిజిపి స్వాతిలక్రా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత వాఖ్యలు, వేధింపులకు పాల్పడిన 150 మందికి రాష్ట్ర షీ టీమ్స్ రాష్ట్ర మహిళా భద్రత విభాగం ప్రధాన కార్యాలయం నుండి ఎడిజిపి స్వాతిలక్రా ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈక్రమంలో మహిళలపై వేధింపులకు పాల్పడిన 150మందిలో 143 మంది మేజర్లు కాగా, 07 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ఎడిజిపి స్వాతిలక్రా మాట్లాడుతూ పోకిరీలకు కౌన్సెంగ్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే వారు తప్పిదాలు చేసిన వ్యక్తుల్లో మార్పు తీసుకురాడమేనన్నారు.

తమ తప్పును తెలుసుకున్న వారు ఇక మీదట ఇలాంటి తప్పిదాలకు పాల్పడబోమని హామీ ఇచ్చిన అనంతరం వారికి వదలిపెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులకు అనుగుణం గా ఆన్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. గత నెల అక్టోబర్ నెలలో కుడా ఇదే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించినామని, మారుమూల ప్రాంతాలలో కూడా నైపుణ్యం కలిగిన కౌన్సిలర్లు గీత, ఇతర సహాయ సిబ్బంది ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా గతంలో చేసిన తప్పిదాలను వారికి తెలిసేటట్లు చేసి, వారిలో మార్పు తీసుకురావడానికి ఉద్దేశించినదని వివరించారు. మహిళా భద్రత విభాగం డిఐజి సుమతి మాట్లాడుతూ షీ టీం యొక్క పనితనము, పురోగతి, కౌన్సిలింగ్ ఎందుకు అవసరం, కౌన్సిలింగ్ వాళ్ళ ఉపయోగాలు, గతంలో కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల వచ్చిన ఫలితాల గురుంచి వివరిస్తూ, నైపుణ్యం కలిగిన కౌన్సిలర్లు ద్వారా మరోసారి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

క్రియాశీలక నిర్మాణాత్మకత ఆధారంగా, ఆమోదయోగ్యమైన పద్దతిలో, ప్రయోగాత్మకంగా సత్ఫలితాలనిచ్చిన పద్దతిలో, ప్రభావవంతంగా ఉండే విధంగా కౌన్సిలింగ్ విధానం రూపొందించినట్లు తెలిపారు. అనంతరం ఎడిజిపి స్వాతి లక్రా, డిఐజి సుమతిలు కౌన్సిలింగ్ కు విధానానికి సంబంధించిన ఒక బుక్ లెట్ ను ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్లా కొన్ని ప్రయోగాత్మక విధానాలను అవలంభిస్తూ వారి తప్పును తెలుసుకొని వారిలో మార్పు వచ్చేలా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News