Wednesday, May 15, 2024

ఎపికి ప్రత్యేక హోదా కుదరదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మంత్రి నిత్యానంద్‌రాయ్ తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపి రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయని, ఆయా సమస్యల పరిష్కారం తమ చేతుల్లో లేదని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని నిత్యానంద్‌రాయ్ సూచించారు.

ఇప్పటికే ఎపికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు విభజన హామీ అమలు వివిధ శాలతో సమీక్ష చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉందన్న ఆయన విభజన హామీలపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ఈక్రమంలో విభజన చట్టం అమలు పురోగతిని హోంశాఖ సమీక్షిస్తోందని తెలిపారు. దీంతో ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని మరోసారి తన కేంద్ర తన వైఖరిని కేంద్రం స్పష్టంగా చెప్పింది.

No Special Status to AP Says Minister Nityanand Rai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News