Saturday, May 4, 2024

కెమిస్ట్రీలో నోబెల్ అవార్డుల వెల్లడి

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోం : రసాయనిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కార విజేతల పేర్లను ప్రకటించారు. అమెరికాకు చెందిన శాస్త్రజ్ఞులు మౌంగి బవెండి, లూయిస్‌బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు ఈ అవార్డును సంయుక్తంగా అందిస్తున్నట్లు బు ధవారం రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. నానో టె క్నాలజీ సంబంధిత క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణకు గుర్తింపుగా వీరిని ఈ ఏటి నోబెల్ కెమిస్ట్రీ అవార్డులకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఆధునిక కాలంలో ఈ క్వాంటమ్ డాట్స్ పలు విధాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటిని టీవీలు మొదలు ఎల్‌ఇడి లైట్ల వరకూ వినియోగిస్తున్నారు. అత్యంత సూక్ష్మస్థాయి ఈ నానో పార్టికల్స్‌ను ఇప్పుడు వైద్యరంగంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ట్యూమర్ల తొలిగింపు ప్రక్రియకు వీటిని వైద్యులు విశేషరీతిలో వాడుతున్నారు. ఇటువంటి అత్యంత కీలకమైన సూ క్ష్మ కణాల ఆవిష్కరణ, వీటిని అభివృద్ధి చేయడంలో అమెరికాకు చెందిన ఈ త్రయం విశేషంగా పాటుపడింది. దీ నిని గుర్తించి వీరిని నోబెల్‌కు ఎంపిక చేశారు.

ప్రకటనకు ముందే పేర్లు
ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలకూ లీక్‌ల బెడద తలెత్తింది. డిసెంబర్‌లో బహుకరించే నోబెల్ అవార్డులను ఈ వారంలో వివిధ విభాగాలకు సంబంధించి వరుసగా ప్రకటిస్తున్నారు. ఈ దశలో నోబెల్ కెమిస్ట్రి రంగ పురస్కార వి జేతల పేర్లు ముందుగానే స్వీడిష్ మీడియా వార్తాసంస్థలు వెల్లడించాయి. ఇది ప్రపంచవాప్తంగా కలవరానికి దారితీసింది. నోబెల్ విజేతల పేర్ల వెల్లడికి కొద్ది గంటల ముందు విజేతల పేర్లు బయటకు వచ్చాయి. స్వీడన్‌కు చెందిన డాగెన్స్ నిహెటర్, దేశానికి చెందిన అధికారిక రేడియో, టీవీలలో సంబంధిత వార్తలు ముందుగా రావడంతో , అసాధారణ రీతిలో సమాచారం లీక్ అయిందనే విషయం స్పష్టం అయింది. నోబెల్ పురస్కారాల రాయల్ స్విడిష్ అకాడమీ నుంచి తమకు సమాచారం అందిందని, దీనిని ప్రాతిపదికగా చేసుకునే విజేతల పేర్లను వెల్లడిస్తున్నామని మీడియా వార్తలలో తెలిపారు. ఈ వార్తలపై నోబెల్ కమిటీ విశ్లేషకులు హీనెర్ లింక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సంస్థ నుంచి అధికారిక ప్రకటనకు ముందు పేర్లు వెలువడితే అది తప్పిదం అవుతుంది. దీనిని కమిటీ తీవ్రంగా తీసుకుంటుందని తెలిపారు. అయినా ఇది ఏ స్థాయిలో లీక్ అయిందనేది ఆరాతీస్తామని వివరించారు. నోబెల్ విజేతల ఎంపిక అత్యంత రహస్యంగా సాగుతుంది. ప్రకటనకు గంట ముందు కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులోనే తమ ముందుకు వచ్చిన నామినేషన్ల పరిశీలన తరువాత విజేతల ఎంపిక జరుగుతుంది. ఆ తరువాతనే మీడియాకు తెలియచేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News