Saturday, May 4, 2024

రెండో రోజూ రిజిస్ట్రేషన్ల హవా

- Advertisement -
- Advertisement -

3,433 డాక్యుమెంట్లు…స్టాంపుడ్యూటీలు, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రూ.20.92 కోట్లు
 5,005 చలాన్లు…రూ.30.16 కోట్ల ఆదాయం

 దూసుకుపోతున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ

 కొన్నిచోట్ల పెరిగిన రద్దీ… టోకెన్ల సిస్టంను అమలు చేసిన సబ్   రిజిస్ట్రార్‌లు

 ఈ స్టాంప్ మాడ్యూల్ ద్వారా ఇంటి నుంచే స్టాంపు డ్యూటీ చెల్లింపు

మనతెలంగాణ/హైదరాబాద్: రెండోరోజూ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ల హవా కొనసాగింది. సాధారణ రోజుల్లో జరిగిన మాదిరిగానే 3 నుంచి 5 వేల లావాదేవీల దిశగా దూసుకు పోతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ అర్భన్ వంటి నగరాల్లో రిజిస్ట్రేషన్‌లు పుంజుకున్నాయి. రెండోరోజూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 3,433 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా, దస్తావేజుల స్టాంపుడ్యూటీలు, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రూ.20.92 కోట్ల రాబడి ప్రభుత్వానికి వచ్చింది. అయితే ఆరు నెలలపాటు ఈ చలాన్ల చెల్లింపులకు వెసులుబాటు ఉండడంతో మంగళవారం ఒక్కరోజే 5,005 చలాన్లను జనరేట్ చేశారు. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.30.16 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇక్ ఆఫ్‌లైన్‌లో 1,398 చలాన్లు రాగా వాటి విలువ రూ.9.17 కోట్లుగా ప్రభుత్వ పేర్కొంది. ఈ నెలలో మొత్తంగా 19,539 ఆన్‌లైన్ ఈ చలాన్‌లతో రూ.189 కోట్ల రాబడి ప్రభుత్వానికి సమకూరింది. మ్యుటేషన్ ఫీజు రూపంలో రూ.17 లక్షలు వచ్చాయి.
ఉదయం నుంచి రాత్రి వరకు విధులు
అయితే సబ్ రిజిస్ట్రార్‌లు ఉదయం 10 గంటలనుంచి రాత్రి వరకు నిరంతరాయంగా పనిచేయడంతో పాటు డాక్యుమెంట్లను స్కాన్‌చేసి వెనువెంటనే వినియోగదారులకు అందచేశారు. రద్దీ నేపథ్యంలో కొన్నిచోట్ల టోకెన్లను జారీ చేసి సీరియల్ నెంబర్‌ల ప్రకారం రిజిస్ట్రేషన్‌లు చేశారు.
నూతన సంస్కరణలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ముందుకు
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ గతంలో అనేక నూతన ఒరవడులకు తెరపైకి తీసుకొచ్చి మెరుగైన సేవలను అందిస్తోంది. దీంతోపాటు దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఈ స్టాంప్స్ మ్యాడ్యూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఏటా 7వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తున్న ఈ శాఖ నూతన సంస్కరణలతో ముందుకెళుతోంది.
ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ స్టాంప్స్ మాడ్యూల్ ద్వారా బ్యాంక్ చలాన్‌లు, బ్యాంక్ చెల్లింపుల బెడద నుంచి ఆస్తుల క్రయ, విక్రయదారులకు జాప్యం తొలగించుకుంది. ఈ విధానంతో డిజిగ్నెటెడ్ బ్యాంకుల్లో చెల్లించాల్సి రుసుములకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఈ నేపథ్యంలో క్రయ, విక్రయదారుల్లో జాప్యం తగ్గింది.
775 ఎస్‌బిఐ బ్రాంచీలతో ఒప్పందం
రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి రుసుముల చెల్లింపులన్నీ ఏ బ్యాంకు నుంచి అయినా ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటు కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు అమల్లో ఉన్న మాన్యూవల్ చలాన్ ప్రభుత్వం తొలగించింది. దీనికిగాను 775 ఎస్‌బిఐ బ్రాంచీలతో ఒప్పందం కుదుర్చుకుంది. స్టాంప్‌డ్యూటీని ప్రజలు స్వచ్ఛందంగా మదింపు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించడంతో ప్రస్తుతం పాత పద్ధతికి అద్భుతంగా అమలయ్యింది. తద్వారా ఈ స్టాంప్ మాడ్యూల్ ద్వారా ఇంటి నుంచే స్టాంపు డ్యూటీని చెల్లించి గంటలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వెసులుబాటును కల్పించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Non Agricultural Registrations Continues in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News