Monday, August 11, 2025

‘వార్2’ బొమ్మ అదిరిపోయింది: ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన యాక్ష న్ థ్రిల్లర్ ‘వార్ 2’. యష్ రాజ్ ఫీలిమ్స్ బ్యానర్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ 25 సంవత్సరాలు క్రితం ‘కహోనా ప్యార్ హై’లో హృతిక్ డ్యాన్స్ చూసి మైమరచి పోయాను. డాన్స్ అంటే నాకు మైఖేల్ జాక్సన్ మాత్రమే. ఇప్పుడు ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో హృతిక్ రోషన్ ఒకరు. ఇండియాలో గొప్ప డ్యాన్సర్ హృతిక్ రోషన్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఎన్టీఆర్ చేస్తున్న హిందీ సినిమానే కాదు, హృతిక్ చేస్తున్న తెలుగు మూవీ కూడా. నేను ’వార్ 2’ చేయడానికి ముఖ్య కారణం.. కథ, అందులో బలం, దర్శకుడు, ‘నువ్వు ఈ సినిమా చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా’ అని చెప్పి నాకు నమ్మకం కలిగించిన ఆదిత్య చోప్రాకి నా ధన్యవాదాలు. ఆయన మాట నమ్మకుండా ఉండి ఉంటే, మీ ముందు ఇంత గర్వంగా నిలబడి ఉండేవాడిని కాదు. యశ్‌రాజ్ ఫిలమ్స్ యూనివర్స్‌లోకి నన్ను తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా అద్భుతమైన అవుట్‌పుట్ రావడానికి దర్శకుడు అయాన్ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. ‘వార్2’ బొమ్మ అదిరి పోయింది‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగవంశీ, ఎన్‌టిఆర్, ఆయాన్ ముఖర్జీ, హృతిక్ రోషన్, అక్షయ విధానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News