Monday, April 29, 2024

మెడికల్ కోర్సుల్లో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ కోటా అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

OBC, EWS quota should be implemented in medical courses

ప్రధాని మోడీకి ఎన్‌డిఎ ఎంపిల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఒబిసి కేటగిరీకి చెందిన ఎన్‌డిఎ ఎంపిల బృందం బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వైద్య కోర్సుల్లో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ కోటాను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ బృందంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో పాటుగా బిజెపి ఎంపిలు గణేశ్ సింగ్, సురేంద్ర సింగ్ నాగర్, అప్నాదళ్ ఎంపి, కేంద్ర మంత్రి అనుప్రియా పాటిల్ ఉన్నారు. వైద్య విద్యా కోర్సుల్లో అలిండియా కోటాలో ఒబిసి, ఆర్థికంగా బలహీన వర్గాల( ఇడబ్లుసి) కోటాను అమలు చేయాలంటూ ఈ బృందం ప్రధానికి ఒక లేఖను కూడా అందజేశారు. కాగా ఈ వారం ప్రారంభంలో జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఈ సమస్యను సంబంధిత మంత్రిత్వ శాఖలు ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్లు అధికార వర్గాలు ఇంతకు ముందు తెలిపాయి.

మెడికల్ కోర్సుల్లో అడిషన్ల కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రప్రభుత్వ మెడికల్ కాలేజిల్లో 15 శాతం అండర్ గ్రాడ్యుయేట్, 50 శాతం పోస్టుగ్రాడ్యేయేట్ మెడికల్, డెంటల్ సీట్లను ‘సెంట్రల్ పూల్’కు సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆలిండియా కోటా అయినందున దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ కోటా కింద అడ్మిషన్‌కు అర్హులు. అయితే ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు ఈ కోటా కింద రిజర్వేషన్లున్నాయి కానీ, ఎబిసిలకు రిజర్వేషన్ లేదని ఎన్‌డిఎ ప్రతినిధి బృందం చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News