Friday, April 26, 2024

వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్.. షెడ్యూల్‌ ప్రకటన

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రతిష్టాత్మకమైన పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) అధ్యక్షుడు జైషా టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుందని షా వివరించారు. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియాకప్ జరుగనుంది. వచ్చే ఏడాది మహిళల ఆసియాకప్‌ను నిర్వహిస్తున్నట్టు జైషా వెల్లడించారు. కాగా, టోర్నీకి సంబంధించిన వేదిక గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామన్నారు.

ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆసియాకప్‌ను కూడా వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసియాకప్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జైషా హామీ ఇచ్చారు. కాగా 2024లో మహిళలకు కూడా ఆసియా కప్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ టోర్నీ టి20 ఫార్మాట్‌లో జరుగుతుందన్నారు. కాగా, పురుషుల ఆసియాకప్ వేదిక విషయంలో నెలకొన్న అనిశ్చితికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని జైషా ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే ఈసారి పురుషుల ఆసియాకప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాన్నారు. జట్లను రెండు గ్రూపులుగా విభజించామన్నారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. మిగిలిన మూడు జట్లను క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఎంపిక చేస్తామని జైషా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News