Sunday, April 28, 2024

ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ విలయ తాండవం

- Advertisement -
- Advertisement -

Omicron in European countries

లండన్ : ప్రపంచవ్యాప్తంగా వరుసగా రెండో రోజు 10 లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఐరోపా రికార్డు కేసులతో సతమతమవుతోంది. ఫ్రాన్స్‌లో ఇదివరకెన్నడూ లేని విధంగా 1,79,807 కేసులు వెలుగు చూశాయి. జనవరి ప్రారంభంలో ఒక్కరోజే 2,50,000 కేసులు రావొచ్చని అక్కడి ఆరోగ్యమంత్రి ఇదివరకే హెచ్చరించారు. ఫ్రాన్స్‌తోపాటు ఇటలీ, గ్రీస్, పోర్చుగల్, ఇంగ్లండ్‌లో కూడా రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. బ్రిటన్‌లో 1,29,471 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కొత్త ఆంక్షలు తీసుకురావడం లేదని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించిన మరునాడే ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

ప్రజలంతా కొవిడ్ నియమావళిని పాటిస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకాలని బ్రిటన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అమెరికాలో కరోనా కేసుల్లో 58.6 శాతం ఒమిక్రాన్ కేసులే కనిపిస్తున్నాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో 3,41,278 కేసులు బయటపడ్డాయి. ఆ దేశంలో కరోనా అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇవే అత్యధిక కేసులు. అలాగే అక్కడ ఐసొలేషన్, క్వారంటైన్ సమయాన్ని 10 రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్ని దేశాలతో కలుపుకొని కరోనా కొత్త కేసులు 10 లక్షల మార్కు దాటడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News