Sunday, April 28, 2024

ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం: డిజిపి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్ దూరదృష్టితో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నారని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతుందన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని, సురక్షిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలియజేశారు. నేరాల దర్యాప్తులో సిసి కెమెరాల పారదర్శకమైన ఆధారాలుగా నిలుస్తున్నాయని, ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానమని తెలిపారు. సిసి కెమెరాల ఏర్పాటులో నగర ప్రజల సహకారం సంతోషకరమని, శాంతి భద్రతల పరిరక్షణలో సహకరిస్తున్న వారందరికీ డిజిపి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మొత్తం లక్ష కెమెరాలు ఉన్నాయన్నారు. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా నగరంలో శాంతి భద్రతలను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏకకాలంలో ఐదు వేల కెమెరాలను వీక్షించే సదుపాయం ఉందని, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటవుతున్నాయి. సిసి కెమెరాల దృశ్యాల్ని ఈ కేంద్రం నుంచే పర్యవేక్షించనున్నారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్, డెటా సెంటర్, నగరంలోని 10 లక్షల సిసి కెమెరాల నెల రోజుల ఫుటేజీని భద్ర పరిచే సర్వర్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News