Monday, May 6, 2024

వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Warangal

వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున రాయపర్తి మండలంలోని మైలారం సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు వాహనాల ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

One Killed in Road Accident in Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News