Tuesday, April 30, 2024

అమెరికాలో మరోసారి కాల్పులు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One shot dead at Fort Valley State University in America

వాషింగ్టన్‌: అమెరికా మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఫోర్ట్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో గత శనివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి యూనివర్శిటీ విద్యార్థి కాదని, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (జీబీఐ) తెలిపింది. కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగతున్నాయని, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని జీబీఐ పేర్కొంది.

One shot dead at Fort Valley State University in America

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News