Wednesday, May 15, 2024

కారు పైనుంచి వెళ్లడంతో …. బాబు మృతి

- Advertisement -
- Advertisement -

One year old baby dead in Car accident

 

హైదరాబాద్: 11 నెలల పాప పైనుంచి కారు వెళ్లడంతో బాబు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుంటూరు జిల్లాకు తోట రమేష్ తన భార్య అనూష, పిల్లలతో కలిసి కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌లో ఉంటున్నాడు. ఇద్దరు కూతుళ్లు, జశ్వంత్(11)తో కలిసి రోడ్డుపైన ఆడుకుంటున్నారు. కిరణ్ అనే వ్యక్తి కూకట్‌పల్లిలోని తన ఆఫీస్‌కు వెళ్లేందుకు కారులో బయలుదేరాడు. కారులో ఉన్న కిరణ్ హారన్ కొట్టడంతో అందరూ పక్కకు జరిగారు కానీ జశ్వంత్ నడవలేకపోవడంతో పాకుతుండగా కారు బాబు పైనుంచి పోనిచ్చాడు. వెంటనే జశ్వంత్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News