Friday, May 3, 2024

పాతబస్తీలో కొనసాగుతున్న హై అలెర్ట్

- Advertisement -
- Advertisement -

Ongoing high alert in the old city

ఎఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్‌పై దాడి నేపథ్యంలో
గురువారం రాత్రి నుంచి ఆందోళనలు చేస్తున్న కార్యకర్తలు

హైదరాబాద్ : ఎఐఎంఐఎం అధినేత,ఎంపి అసదుద్దీన్‌పై ఉత్తరప్రదేశ్‌లో దాడి జరగడంతో పాతబస్తీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అసద్‌పై దాడి జరగడంతో పోలీసులు అప్రమత్తమై గురువారం రాత్రి నుంచి పాతబస్తీలో హైఅలెర్ట్ ప్రకటించి పోలీస్ బలగాలను దింపాలరు. అంతేకాకుండా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు, దీనికి తోడు శుక్రవారం కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రార్థనల అనంతరం ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. యూపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి ఎంపి అసదుద్దీన్ తిరిగి వస్తుండగా టోల్‌ప్లాజా వద్ద ఓవైసి కారుపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఎవరూ గాయపడకున్నా, పాతబస్తీలో టెన్షన్ నెలకొంది. గురువారం రాత్రి నుంచే పాతబస్తీలో ఎంఐఎం నేతలు ఆందోళనలు చేస్తున్నారు. పాతబస్తీలోని సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి నిఘా పెంచారు. ఆందోళనలు కొనసాగుతున్న దృష్టా పోలీసులు హైఅలర్ట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పాతబస్తీలోని వివిధ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిరంతంరం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News