Monday, May 6, 2024

యాదాద్రిలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆలయ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసిన అర్చకులు మేళతాళాలు, మంత్రోచ్ఛరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పురవీధులలో ఊరేగించారు. అద్దాల మండపములో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను అర్చకులు భక్తులకు వివరించగా అమ్మవారిని సేవను భక్తులు దర్శించుకున్నారు.

ఆలయ నిత్యపూజలో భక్తులు..
శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకొని ఆలయ నిత్యపూజలలో పాల్గొన్నారు. ఆలయం జరిగిన శ్రీవారి నిత్యకల్యాణం, సువర్ణ పుష్పర్చన,సుదర్శన నారసింహ హోమం, వెండిజోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. శ్రీవారి కొండపైన కొలువు దీరిన శ్రీ పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము, కొండ కింద శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి నిత్యరాబడి..
స్వామివారి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శుక్రవారం రూ. 16,55,653 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,57,100, బ్రేక్ దర్శనం ద్వారా రూ.83,400, వ్రత పూజల ద్వారా రూ.63,200, వీఐపీ దర్శనాల ద్వారా రూ.37,500, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.2,00,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.7,88,340, తదితర శాఖల నుంచి ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News