Thursday, May 9, 2024

యువతలో నైపుణ్యాన్ని వెలికితీయడానికి టీటా మరో ముందడుగు

- Advertisement -
- Advertisement -

Opportunity for youth as enumerators in 7th Economic Survey

 

హైదరాబాద్‌లోనే 5 నుంచి 6 వేల మందికి..
పదో తరగతి పాసై, స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ వచ్చిన వారికి అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : యువతలో నైపుణ్యాన్ని వెలికితీయడానికి టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్) డిజిథాన్ సంస్థ మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో జరుగుతున్న 7వ ఆర్థిక సర్వేలో ఎన్యుమరేటర్లుగా అవకాశం కల్పించనుంది. వన్ మిలియన్ డిజిటల్ సర్వేలు చేయడమే లక్ష్యంగా టీటా ముందుకుసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సర్వేకు సంబంధించిన డిజిటల్ పోస్టర్‌ను టీటా ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల, రాజాకిశోర్‌లు ఆవిష్కరించారు. టీటా వివిధ కార్యక్రమాల ద్వారా చాలామంది యువతను కంప్యూటర్ అక్షరరాస్యులుగా తీర్చిదిద్దారు. అందులో భాగంగా వీరికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా సిఎస్‌సితో ఒప్పందం కుదుర్చుకొని మరో నూతన ప్రణాళికకు టీటా శ్రీకారం చుట్టింది.

ముందుగా జిహెచ్‌ఎంసి పరిధిలో చేపట్టబోయే సర్వేలో భాగంగా రాబోయే నెలరోజుల్లో వన్ మిలియన్ డిజిటల్ సర్వేలు చేయాలని టీటా లక్షంగా ముందుకుసాగుతోంది. తెలంగాణ ఐటి అనుబంధ సంస్థ అయిన డిజిథాన్, సిఎస్‌సిలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం టీటాతో సిఎస్‌సి ఒప్పందం కుదుర్చుకుంది. 10లక్షల ఇళ్లకు టీటా ప్రతినిధులు వెళ్లి మొబైల్ అప్లికేషన్ ద్వారా వారి వివరాలను సేకరించనున్నారు. గ్రేటర్ పరిధిలో 573 ఇన్వేస్టిగేటర్ యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌కు 10 వరకు ఎన్యుమరేటర్లు కావాల్సి ఉంది.

హైదరాబాద్‌లో సుమారుగా 5 వేల నుంచి 6 వేల మంది ఎన్యుమరేటర్లు పనిచేయాల్సి ఉంది. ఇందులో భాగస్వామ్యం కావాలనుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణులై, స్మార్ట్ ఫోన్ వాడకంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. bit./censussurvey ద్వారా వివరాలను నమోదు చేసుకొని ఎన్యుమరేటర్ అవకాశం కోసం పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులయితే రానున్న రోజుల్లో ప్రతి డిజిటల్ సర్వేలో అవకాశం పొందుతారని టీటా ప్రతినిధులు తెలిపారు. మరిన్ని వివరాలకు 6300368705, 9542809069, 7989702090,9948185053 నెంబర్‌లలో సంప్రదించాలని టీటా ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News