Sunday, April 28, 2024

ప్రధాన రేవుల అభివృద్ధి బిల్లుకు రాజ్యసభలో విపక్షాల వ్యతిరేకత

- Advertisement -
- Advertisement -

Opposition in Rajya Sabha oppose bill to develop major ports

 

ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని టిఆర్‌ఎస్ ఎంపి బండ ప్రకాష్ సూచన

న్యూఢిల్లీ : దేశంలో ప్రధాన రేవుల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును రాజ్యసభలో బుధవారం కాంగ్రెస్, టిఎంసి, ఎస్‌పి, ఆర్‌జెడి, డిఎంకె, సిపిఎం, సిపిఐ, టిఆర్‌ఎస్ తదితర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రేవులను ప్రైవేట్‌పరం చేయడానికి, ఆయా భూములపై రాష్ట్రప్రభుత్వాలకు ఉన్న హక్కులను నిర్వీర్యం చేయడానికే ఈ బిల్లు అని విమర్శించాయి. అయితే బిజెడి, జెడి(యు), వైఎస్‌ఆర్‌సిపి, మాత్రం ఈ బిల్లుకు మద్దతు పలికాయి. దీనిపై జరిగిన చర్చలో శక్తిసిన్మా గొహిల్ (కాంగ్రెస్) ప్రసంగిస్తూ ఈ బిల్లులో దొడ్డిదారిన మిత్రులకు అవకాశం కల్పించారని విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ నౌకారవాణా మంత్రి జికె వాసన్ ఈ పోటీ ప్రపంచంలో పోర్టు అథారిటీ నిర్ణయించే టారిఫ్ పోర్టు రెవెన్యూకు తగినట్టు లేదని అన్నారు.

ఇది సింగపూర్ మోడల్ కార్పొరేటైజేషన్ తప్ప ఈ బిల్లులో మరేమీ లేదని టిఎంసి నేత సుఖేందు శేఖర్ రే వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌కు చెందిన బండ ప్రకాష్ పోర్టులను ప్రైవేటీకరణ చేయరాదని కోరారు. లాభాలతో ఉన్న షిప్పింగ్ కార్పొరేషన్‌ను ఎలా విక్రయానికి పెట్టినందున పోర్టులను ప్రైవేటీకరణ చేయడం తగదని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సిపిఎంకు చెందిన ఎలమరన్ కరీం పోర్టు అధారిటీని కార్పొరేట్ సంస్థగా మార్చడానికి ఈ బిల్లు ఉద్దేశించబడిందని, పోర్టుల ఆస్తులన్నీ ప్రైవేట్ పరమౌతాయని విమర్శించారు. కొచ్చిన్, వైజాగ్, ముంబై, గోవా తదితర రేవులు రక్షణ పరికరాలను రవాణా చేస్తుంటాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించిందని, అలాంటప్పుడు ప్రైవేట్ పరం చేస్తే జాతివ్యతిరేక శక్తులకు వీటి సమాచారం చేరే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సిపికి చెందిన అయోధ్యరామిరెడ్డి బిల్లును స్వాగతించారు. రేవుల విస్తరణకు కావలసిన మౌలిక సదుపాయాలు వృద్ది చెందుతాయన్న ఆశాభావం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News