Friday, May 3, 2024

ఆటోమోబైల్స్ దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Automobile Thieves Arrested in Hyderabad

హైదరాబాద్: బైక్‌లను దొంగతనం చేస్తున్న గ్యాంగ్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చిక్కడపల్లి పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 38 బైక్‌లు, 16నకిలీ డాక్యుమెంట్లు, రెండు జిపిఎస్ ట్రాకర్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.30 లక్షలు ఉంటుంది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన ఎండి రిజ్వాన్, ఎండి యాసిన్, మీర్ హ్మంజా, ఎండి వాజీద్, సయిద్ అహ్మద్ మెహిందీ అలియాస్ అబ్బు, ఎంఎ అజిజ్, నుమన్ కలిసి బైక్‌లను చోరీ చేస్తున్నారు. సయిద్ అహ్మద్ మెహెందీ, ఎంఎ అజీజ్, నుమన్ పరారీలో ఉన్నారు. ఇందులో ఎండి రిజ్వాన్, సయిద్ అహ్ద్ మెహిందీ అలియాస్ అబ్బూ విద్యార్థులు. నిందితులు అందరూ యాకత్‌పురా, భవానీనగర్‌కు చెందిన వారు ఇంటర్ వరకు చదువుకున్నారు.

ప్రధాన నిందితుడు ఎండి రిజ్వాన్‌కు వోగో వాహనాలు, వాటి జిపిఎస్ సిస్టం గురించి మొత్తం తెలుసు. ఈ విషయాన్ని మిగత స్నేహితులు ఎండి యాసిన్, ఎండి హ్మంజా,సయిద్ అహ్మద్ మెహెందీకి చెప్పాడు. అందరూ కలిసి మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసి వోగో బైక్‌లను చోరీ చేస్తున్నారు. ముఠాను ఏర్పాటు చేసి మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసి వోగో రెంటల్ బైక్‌లను చోరీ చేశారు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేశారు. బైక్‌లను ఓటిపి, జిపిఎస్ ట్రాకింగ్ సిస్టం ఉండడంతో చోరీ చేసిన తర్వాత నిందితులు బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి జిపిఎస్ ట్రాకింగ్ సిస్టం, వోగో లోగో, బార్‌కోడ్, కీప్యాడ్ లాకింగ్ సిస్టంను తీసివేస్తున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి ఎండి వాజిద్, ఎంఎ అజీజ్‌కు విక్రయిస్తున్నారు. ఇలా చోరీ చేసిన బైక్‌లను రూ.15,000 నుంచి రూ.20,000కు విక్రయిస్తున్నారు. నిందితులు చిక్కడపల్లి పిఎస్, ఎల్‌బి నగర్ పిఎస్, ఉప్పుల్, అబిడ్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్‌లను దొంగతనం చేశారు. బైక్‌ల చోరీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎడిసిపి చక్రవర్తి గుమ్మి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు శ్రీశైలం, తకియుద్దిన్, నరేందర్, చంద్రమోహన్, సిబ్బంది పట్టుకున్నారు.

Automobile Thieves Arrested in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News