Saturday, April 27, 2024

ప్రతిపక్షాల ఐక్యత సమావేశం జూన్ 23కు వాయిదా?!

- Advertisement -
- Advertisement -

పాట్నా: సీనియర్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఉండని కారణంగా జూన్ 12న జరగాల్సిన ప్రతిపక్ష ఐక్యత సమావేశం జూన్ 23కు వాయిదా వేయనున్నారు. అయితే సారూప్య భావజాలం ఉన్న పార్టీల ఆమోదం తీసుకున్నాకే తేదీని ఖరారు చేయనున్నారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఓ పెద్ద కుదుపనే భావించాలి.

సమావేశం వాయిదా వేయడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశంలో ఉండడం, పైగా పాట్నా సమావేశానికి హాజరయ్యేందుకు మల్లికార్జున ఖర్గే సైతం అయిష్టతను కనబరిచారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కర్నాటక అసెంబ్లీలో అఖండ విజయం సాధించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి సత్తాను పుంజుకుంది. ఇదిలావుండగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అది కూడా లోక్‌కసభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు. కాంగ్రెస్ ప్రత్యక్షంగా బిజెపితో తలపడనున్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపగలరు.

పాట్నాలో ప్రతిపక్షల ఐక్యత సమావేశాన్ని ప్రతిపాదించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె సంబంధాలు కాంగ్రెస్ పార్టీతో అంతంత మాత్రంగానే ఉన్నాయి. బీహార్‌లో ప్రతిపక్షాల సమావేశం జరుగనుండడం, దానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వం వహించడం, కాంగ్రెస్‌కు ఆమోదయోగ్యం కాదని అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News