Tuesday, April 30, 2024

276 వర్సెస్ 176

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో చోటు చేసుకున్న అమానవీయ ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లోను చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంసైతం చర్చకు సిద్ధమేనని, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి ఒక ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంటులో చర్చించాల్సిన అన్ని అంశాలను పక్కన పెట్టి మణిపూర్‌పై మాత్రమే చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూల్ 176 కింద చర్చకు సిద్ధమేనని కేంద్రం అంటుంటే ప్రతిపక్షాలు మాత్రం రూల్ 276 కింద చర్చ జరగాలని డియాండ్ చేస్తున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తాము రూల్ 267 ప్రకారం నోటీసు ఇచ్చామని, కాబట్టి పార్లమెంటులో చర్చించాల్సిన అన్ని అంశాలను పక్కన పెట్టి మణిపూర్ అంశంపై చర్చించాలని ఆయన స్పష్టం చేశారు.

అర్ధ గంట చర్చ సరిపోదని, అక్కడ రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు.అయితే ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా చర్చకు అనుమతించడం లేదని ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో రూల్ 176, రూల్ 276కు మధ్య ఉన్న తేడా ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా రూల్ 276 ఏమిటో చూద్దాం. రాజ్యసభ నిబంధనల ప్రకారం రూల్ 276 కింద సభలోని ఏ సభ్యుడైనా ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుతూ,దేశం ఎదుర్కొంటున్న సమస్య గురించి చర్చకు డిమాండ్ చేయవచ్చు. ఇందుకోసం సభ్యుడు రాతపూర్వకంగా నోటీసు ఇస్తే రాజ్యసభ చైర్మన్ దాన్ని అనుమతిస్తారు. దీనిపై చర్చ సందర్భంగా సభ్యులు ప్రభుత్వాన్ని ఏ అంశం గురించయినా ప్రశ్నలు అడగవచ్చు. అందుకే మణిపూర్ అంశంపై ఈ నిబంధన కింద చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి.

అయితే ఈ రూల్ ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలుకు అంతరాయం కలిగించేందుకు సాధనంగా మారిందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ గత ఏడాది వ్యాఖ్యానించారు. అంతేకాదు గత పార్లమెంటు వీతాకాల సమావేశాల్లో ఈ నిబంధన కింద ఇచ్చిన ఎనిమిది నోటీసులను ఆయన తిరస్కరించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. కాగా 1990నుంచి 2016 వరకు ఈ నిబంధన కింద 11 సార్లు మాత్రమే చర్చ జరిగినట్లు పార్లమెంటు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చివరగా 2016లో అప్పటి రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నోట్ల రద్దుపై చర్చించేందుకు అనుమతించారు.
రూల్ 176
ఇక 176 రూల్‌కింద అరగంటనుంచి రెండున్నర గంటల సమయానికి మించకుండా చర్చకు అవకాశం ఉంటుంది. ఈ నిబంధన కింద సభలోని ప్రతి సభ్యుడు ప్రజాప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాలి.అందులో చర్చించాల్సిన అంశం ప్రాధాన్యతతో పాటు చర్చకు గల కారణాలను కూడా వివరించాలి. అలాగే ఆ నోటీసుకు మద్దతుగా ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి.అయితే ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు పరిగణలోకి తీసుకోవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News