Sunday, April 28, 2024

జనతా కర్ఫ్యూ అసలు ఉద్దేశం

- Advertisement -
- Advertisement -

modi

 

జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం ఆదివారం(నేడు) ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు.
ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవిత సమయం (గాలిలో 3గంటలు. రాగిపై 4గం.లు, అట్టలపై 24గం.లు, స్టీల్‌పై రెండు నుంచి మూడు రోజులు ఉంటుంది) ఆ తర్వాత అది జీవించి ఉండదు.
జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గం.ల తరువాత చాలా మేరకు కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి!
అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు!
అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేర్చవచ్చు. కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండవచ్చు.
సరిగ్గా సాయంత్రం 5 గం.లకు కరోనా మహమ్మారి నిర్మూలనకు ఎంతగానో శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర అత్యవసర సేవా సిబ్బందికి (అంబులెన్స్ డ్రైవర్ నుండి ఆకుకూరలు, పాల పాకెట్లు వేసే కుర్రాడు వరకూ) కృతజ్ఞతగా ఇంటి వాకిట్లోకి/బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టి మద్దతుగా నిలవడం.
ఇలా వైరస్‌కు దూరంగా ఉండడం వల్ల కరోనా ప్రమాదకర మూడో దశను అడ్డుకున్న వాళ్లం అవుతాం.

Original intention of Janata curfew on Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News