Saturday, May 4, 2024

వార్తలు చదువుతున్నది మీ లిసా

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : కృత్రిమ మేధస్సు (ఐఎ) ప్రక్రియతో కృత్రిమ మహిళా యాంకర్‌ను రూపొందించారు. ఐఎను వాడుకుని వార్తలు చదివే యాంకర్‌ను రూపొందించారు. ఈ యాంకర్‌కు లిసా అనే పేరు పెట్టారు. ఈ లిసా ఇప్పుడు ఓడిషాలోని ఓటీవీ వార్తా ఛానెల్ ద్వారా వార్తలు చదువుతుంది. సంబంధిత కృత్రిమ మహిళా యాంకర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే అత్యద్భుత ఘట్టం భువనేశ్వర్‌లో సోమవారం జరిగింది. తమ సంస్థ వార్తా జర్నలిజంలో ప్రవేశించి పాతికేళ్లు అయిన దశలో ఓ కీలక మైలురాయిగా ఈ ఐఎ యాంకర్ లిసా ఇక తమ టీవీ ఛానల్ ద్వారా వార్తలను అందిస్తారని ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ జగి మంగత్ పండా తెలిపారు.

లిసా అన్ని భాషలను మాట్లాడగలదు. అయితే ఇప్పటికైతే దీనిని కేవలం ఆంగ్లం, ఒడిషి భాషలకు పరిమితం చేశారు. తమ రాష్ట్ర భాషలో శిక్షణ చాలా కష్టం అయిందని , అయినా దీనిని సాధించినట్లు తెలిపారు. మనుష్యుల మాదిరిగా స్పష్టమైన ఉచ్ఛారణ లేకపోవచ్చు అయితే గూగుల్ అసిస్టెంటు కన్నా మెరుగ్గా మాట్లాడుతుందన్నారు. ఓటీవిని 1997లో తొలుత భువనేశ్వర్, కటక్ కేంద్రాలుగా ఆరంభించారు . తరువాత ఈ వార్తా ఛానల్ రాష్ట్రంలోని అనేక ప్రధాన పట్టణాలకు విస్తరించుకుంది. ఈ టీవీ ఛానల్‌కు ఇప్పుడు ఈ లిసా ఓ ప్రత్యేక ఆకర్షణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News