Sunday, May 5, 2024

డిసెంబర్ నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్: సీరం

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ః సీరం
అందుబాటులోకి వచ్చేది వచ్చే ఏడాదే

న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఔషధ సంస్థ సీరం ఇనిస్టూట్‌లో తయారు అవుతున్న ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకా డిసెంబర్ నాటికి సిద్ధం అవుతుంది. అత్యధిక డోసుల ఉత్పత్తి సామర్థంపై విశ్వాసంతో ఈ వ్యాక్సిన్ తయారీని భారత్‌కు చెందిన కంపెనీకి ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ అప్పగించింది. డిసెంబర్ నాటికి ఈ టీకా సిద్ధం అయినప్పటికీ నిర్ణీత లక్షంగా పెట్టుకున్న పదికోట్ల డోసులు లేదా వయాల టీకా మొత్తం మీద వచ్చే ఏడాది (2021) రెండవ లేదా మూడవ త్రైమాసిక దశలో అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాని పుణేకు చెందిన సీరం ఇనిస్టూట్ ముఖ్య కార్యానిర్వాహక అధికారి (సిఇఒ) అదర్ పూనావాలా బుధవారం మీడియాకు తెలిపారు. ఉత్పత్తికి సంబంధించి తమకు ఇప్పటికిప్పుడు తాము అత్యవసర లైసెన్సుల కోసం వెళ్లకపోయినా ట్రయల్స్ అన్ని కూడా డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయి. దీనిని బట్టి జనవరిలో భారత్‌లో దీనిని విడుదల చేయడానికి వీలుందని వివరించారు. అయితే బ్రిటన్‌లో ప్రధానంగా జరిగే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌పైనే అంతా ఆధారపడి ఉంటుందని, అక్కడ కూడా పరీక్షలు చివరి అంకానికి చేరాయని తెలిపారు.

ఇక్కడ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. వచ్చే రెండు వారాలలో బ్రిటన్ ప్రభుత్వం తమ అధ్యయనాల విషయంలో పూర్తి స్పష్టతకు రాకపోయినట్లు అయితే లేదా వ్యాక్సిన్ భద్రతపై విశ్వాసం ప్రకటించకపోతే, డాటాను పంపిణీ చేయకపోతే పరిస్థితి మరో విధంగా ఉంటుందన్నారు. అప్పుడు తాము భారత ప్రభుత్వం కోరుకున్నట్లు అయితే వ్యాక్సిన్ తయారీకి అత్యవసర లైసెన్సులకు దరఖాస్తులు చేసుకునే వీలుంటుందని తెలిపారు. దీనికి సంబంధించిన సమీక్షను రెండుమూడు వారాలలో నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ తీసుకురాగలమని నమ్మకంతో ఉన్నామని, అయితే ఇదంతా తన అంచనాలకు సంబంధించిన విషయం అని, ఏదైనా భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని, అధీకృత పంపిణీ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అనే విషయం తెలిసిందేనని స్పష్టం చేశారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం 2021 మధ్యలో కానీ సాధ్యకాకపోవచ్చునని తెలిపారు.

Oxford Vaccine to ready by Dec 2020: Serum Institute

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News