Monday, April 29, 2024

రేపిస్టులకు రసాయనాలతో నపుంసకత్వం, ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

PAK PM Approved Chemical Castration of Rapists

పాకిస్తాన్‌లో ఇక రేపిస్టులకు కఠిన శిక్షలు
ఆర్డినెన్సులకు ఇమ్రాన్ క్యాబినెట్ ఆమోదం

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు రెండు ఆర్డినెన్సులను ఫెడరల్ క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదించింది. అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సహాయంతో నపుంసకులుగా మార్చడంతోపాటు వారికి మరణశిక్ష విధించడం వంటి కఠిన శిక్షలు విధించడానికి వీలు కల్పించే కొత్త చట్టాల అమలులో భాగంగా ఈ రెండు ఆర్డినెన్సులకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన మంగళవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో సూత్రప్రాయంగా ఆమోదించినట్లు ఇస్లామాబాద్ నుంచి వెలువడే ది డాన్ వార్తాపత్రిక బుధవారం తెలిపింది. అంతేగాక అత్యాచారం నిర్వచనాన్ని కూడా మార్చాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు పత్రిక తెలిపింది.

అత్యాచార నిరోధక(దర్యాప్తు, విచారణ) ఆర్డినెన్స్ 2020, పాకిస్తాన్ పీనల్ కోడ్(సవరణ) ఆర్డినెన్స్ 2020లను ఒక వారం రోజుల్లో ఖరారు చేసి అమలులోకి తీసుకువస్తామని పాకిస్తాన్ సమాచార మంత్రి షిబ్లీ ఫరాజ్ తెలిపారు. రేపిస్టులకు శిక్షగా రసాయనాల ద్వారా నపుంసకులుగా మార్చడం, ఉరిశిక్ష విధించడానికి ఉద్దేశించిన ఈ నిర్ణయాన్ని ఆయన ప్రశంసిస్తూ ఈ ఆర్డినెన్సులు అత్యాచారం నిర్వచనాన్ని మార్చివేస్తాయని, సామూహిక అత్యాచారానికి పాల్పడితే అత్యంత కఠినమైన శిక్ష, ఉరిశిక్ష పడతాయని చెప్పారు. పాకిస్తాన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్‌జెండర్, గ్యాంగ్ రేప్ వంటి పదాలను పొందుపరిచి అత్యాచారం(రేప్) మౌలిక నిర్వచనాన్ని మార్చడం జరుగుతోందని ఆయన చెప్పారు.

అత్యాచార బాధితులకు నిర్వహించి వివాదాస్పద రెండు వేళ్ల పరీక్షను కూడా ప్రతిపాదిత చట్టంలో నిషేధించనున్నారు. ఈ పరీక్షను అశాస్త్రీయంగా, వైద్యపరంగా అనవసరంగా, నమ్మదగనిదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతేగాక ఈ పరీక్షను మహిళల గౌరవమర్యాదలు, వ్యక్తిగత గోప్యత హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించాయి. కాగా..క్యాబినెట్ కమిటీ ఆన్ డిస్పోజల్ ఆఫ్ లెజిస్లేటివ్ కేసెస్ త్వరలోనే ఈ ఆర్డినెన్సులను ఖరారు చేసి కొద్దిరోజుల్లో ఇవి అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంటుందని మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ ట్వీట్ చేశారు. ఈ ఆర్డినెన్సులలో అత్యాచారానికి విస్తృత నిర్వచనం ఇవ్వడం, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, అత్యాచార నిరోధక విభాగం ఏర్పాటు, బాధితులకు, సాక్షులకు భద్రత, టూ ఫింగర్ టెస్ట్ నిషేధం వంటివి ఉంటాయని ఆయన చెప్పారు. ఆర్డినెన్సులను ఆమోదించడం ఇమ్రాన్ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవద్ చౌదరి అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News