Friday, April 26, 2024

కొత్తగా లాక్‌డౌన్ విధించక తప్పదు

- Advertisement -
- Advertisement -

Pakistan warns of new lockdown to people

 

మరణాల రేటు 140 శాతం పెరగడంతో పాక్ ప్రభుత్వంహెచ్చరిక

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో కరోనా మరణాల రేటు 140 శాతానికి పెరగడంతో మళ్లీ కొత్తగా లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని పాక్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ తదితర నిబంధనలను ప్రజలు ఉల్లంఘించకుండా ఉంటే ఆ మహమ్మారిని సులువుగా నివారించ గలుగుతామని పాకిస్థాన్ లోని నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్స్ సెంటర్ (ఎన్‌సిఒసి) బుధవారం హెచ్చరించింది. గత కొన్ని వారాలతో పోల్చి చూస్తే కొవాడ్ 19 మరణాల రేటు పాకిస్థాన్‌లో 140 శాతానికి పెరిగిన దృష్టా ఈ హెచ్చరికలు చేసింది.

ఎన్‌ఒసిసి పరిస్థితిని చాలా లోతుగా పరిశీలిస్తోంది. ప్రామాణిక నిబంధనలు (ఎస్‌ఒపి)పాటించడంలో ఏమాత్రం పురోగతి లేకుంటే సర్వీస్‌లను ఇదివరకటిలా మూసివేయడం తప్ప వేరే గత్యంతరం లేదని హెచ్చరించింది. కరోనా కేసులు విపరీతంగా పెరగడంపై ఎసిఒసి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ప్రణాళిక సంఘం మంత్రి అసాద్ ఉమర్ నేతృత్వంలో ఎస్‌సిఒసి ప్రత్యేక సమావేశమై సమీక్ష నిర్వహించింది. పాకిస్థాన్‌లో గత 24 గంటల్లో 19 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 6,692 కు చేరుకుంది. తాజాగా 660 కేసులు బయటపడడంతో మొత్తం కేసులు 3,24,744 వరకు చేరుకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News