Wednesday, May 8, 2024

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన పల్లా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హరిత తెలంగాణ స్వప్నం సాకారం దిశగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.  తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన పల్లా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్  పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని రైతు బంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో  పల్లా రాజేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా మీడియాతో మాట్లాడారు. గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. మంత్రి కెటిఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ముక్కోటి వృక్షా అర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రం పచ్చని తెలంగాణ దిశగా ముందుకు వెళుతుందని, తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. హరితహారం స్ఫూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజున కోటి వృక్షార్చన ఎలా విజయవంతం చేశామో… అదే స్ఫూర్తితో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పుట్టిన రోజున ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Palla planted trees in Birth day celebrations

ఈ నెల 24న  కెటిఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన పోస్టర్ ను రాజేశ్వర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News