Sunday, April 28, 2024

పరమ్ బీర్ సింగ్‌కు మళ్లీ బెయిలబుల్ వారెంట్ జారీ

- Advertisement -
- Advertisement -

Param Bir Singh slapped with bailable warrant again

ముంబయి: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌మూఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కేసుకు సంబంధించి విచారణకు హాజరుకాని ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌కు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సారథ్యంలోని విచారణ కమిషన్ బుధవారం మరోసారి బెయిలబుల్ వారంట్ జారీచేసింది. ఈ విషయాన్ని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హీరే తెలిపారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై సింగ్ చేసిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి కైలాశ్ ఉత్తమ్‌చంద్ చండీవాల్ సారథ్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తమ ఎదుట హాజరుకావాలంటూ ఇప్పటికే పలుమార్లు సింగ్‌కు కమిషన్ సమన్లు జారీచేసింది. అయితే ఆయన వాటికి స్పందించలేదు. ఈ కారణంగా సెప్టెంబర్ 7న కమిషన్ సింగ్‌కు బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కాగా.. ఈ వారెంట్ ఆయనకు అందక పోవడంతో అక్టోబర్ 6వ తేదీలోగా తమ ఎదుట హాజరుకావాలంటూ మరోసారి వారెంట్‌ను కమిషన్ బుధవారం జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News