Sunday, April 28, 2024

మీరు మార్చుకుంటే నేనూ నా భాషను మార్చుకుంటా

- Advertisement -
- Advertisement -

Uma bharti comments on digvijay singh

దిగ్విజయ్‌పై ఉమాభారతి ఎదురుదాడి

భోపాల్: ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు మోయడానికేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి సీనయర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతి తన భాషను మెరుగుపరుచుకుంటానని, మీరు కూడా మీ భాషను మార్చుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు ఒక లేఖ రాశారు. ప్రభుత్వ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉమాభారతికి సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభ్యంతరకర భాషను విమర్శిస్తూ దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఇందుకు ఆమె అధికారులకు క్షమాపణలు చెప్పాలంటూ ఆయన డిమాండు చేశారు. దీనిపై స్పందించిన ఉమాభారతి మంగళవారం దిగ్విజయ్ సింగ్‌కు క లేఖ రాస్తూ తాను మాట్లాడిన మాటలపై తాను తీవ్రంగా విచారిస్తున్నానని తెలిపారు. మర్యాదపూర్వకమైన భాషను మాట్లాడటం మీకు చేతకాదని నేను మీకు పదేపదే చెప్పేదాన్ని. ఇప్పటి నుంచి నా భాషను నేను మెరుగుపరుచుకుంటాను. మీరు కూడా ఆ పని ఎప్పటి నుంచి చేస్తారు అంటూ దిగ్విజయ్ సింగ్‌ని ఉద్దేశించి ఉమాభారతి తన లేఖలో ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News