Sunday, April 28, 2024

17 వరకు ప్యాసింజర్ విమాన సర్వీసులు రద్దు

- Advertisement -
- Advertisement -

Flights

 

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రకటించడంతో అన్ని కమర్షియల్, ప్యాసింజర్ విమానసర్వీసులను మే 17 అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శనివారం ప్రకటించింది. భారత్ నుంచి అంతర్జాతీయ విమానసర్వీసుల రాకపోకలు ప్రారంభమైతే విదేశీ, స్వదేశీ విమాన సర్వీసుల ప్రారంభం గురించి తెలియచేయడమౌతుందని డిజిసిఎ సర్కులర్ ద్వారా తెలియచేసింది. కరోనా వైరస్ కారణంగా మార్చి 25 నుంచి లాక్‌డౌన్ విధించడంతో భారత్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు రద్దయ్యాయి. అయితే కార్గో సర్వీసులు, వైద్య సహాయానికి సంబంధించిన విమాన సర్వీసులు, స్పెషల్ విమానాల సర్వీసులను మాత్రం అనుమతించారు.

Passenger Flights canceled till 17th
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News