Saturday, May 4, 2024

బ్యాంకు ఖాతాల్లో రెండో విడత రూ. 1500 జమ

- Advertisement -
- Advertisement -

White ration card holders

 

74.35 లక్షల మందికి రూ. 1,115 కోట్లు
మూడు రోజుల్లో పోస్టాఫీసుల ద్వారా 5.38 లక్షల మందికి పంపిణి
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు సిఎం కెసిఆర్ ప్రకటించిన రెండో విడత రూ. 1500 నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రూ. 1500 పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. శనివారం నాడు పౌరసరఫరాల భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ, 74.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1500 చొప్పున మొత్తం రూ. 1,115 కోట్లను బ్యాంకుల్లో జమ చేయడం జరిగిందన్నారు. బ్యాంకు ఖాతాలేని 5.38 లక్షల మంది లబ్ధిదారులకు పోస్టాఫీసు ద్వారా రానున్న మూడు రోజుల్లో రూ. 1500 అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

87.55 లక్షల కుటుంబాలకుగాను ఈ రెండు రోజుల్లో 9 లక్షల (10శాతం) మంది 37 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నారని మారెడ్డి తెలిపారు. బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎవరూ కూడా ఆందోళ చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. లబ్ధిదారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి నగదును పొందాలని సూచించారు. గత నెల 23వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసినట్టుగానే ఈ నెల కూడా ప్రతి ఒక్క లబ్దిదారుడికి రేషన్ అందే వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని తెలిపారు. యాసంగిలో ఇప్పటి వరకు 5904 కొనుగోలు కేంద్రాల ద్వారా 4 లక్షల మంది రైతుల నుంచి రూ. 4,442 కోట్ల విలువైన 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి రూ. 1500 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైర్మన్ తెలిపారు. రైతుల నుంచి కొన్న ప్రతి ధాన్యం కొనుగోలు వివరాలను ఒపిఎం వేర్‌లో నమోదు చేసి దాని ప్రకారమే రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. కొనుగోలు వివరాలను ఒపిఎంఎస్ సాఫ్ట్ వేర్‌లో త్వరితగతిన నమోదు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు.

 

Rs 1500 credited to White ration card holders
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News