Tuesday, May 7, 2024

గిరిజ‌నుల‌తో ‘వకీల్ సాబ్’.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘వ‌కీల్ సాబ్’. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ తొలిసారిగా లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అరకులో జరుగుతోంది. అయితే, షూటింగ్ విరామం సమయంలో అక్క‌డి గిరిజ‌నుల‌తో పవన్ కళ్యాన్ ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆదివాసీలు వారి జీవన స్థితిగ‌తుల‌ను వివ‌రిస్తూ ఓ పాట‌ను పాడారు. ఆ వీడియోను పవన్ త‌న ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, వ‌కీల్ సాబ్ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. బోణి కపూర్, దిల్ రాజ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ విడుదల చేసేందుకు చిత్రనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Pawan spends time with tribals at Vakeel Saab shoot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News