Monday, April 29, 2024

ప్రజాస్వామ్యం ఊహల్లోనే ఉంది.. వాస్తవంలో లేదు: రాహుల్

- Advertisement -
- Advertisement -

Farmers wont go back until laws are repealed says Rahul

న్యూఢిల్లీ: పార్లమెంట్ ను సమావేశపరిచి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సాగు చట్టాలను తప్పుడు పద్ధతుల్లో ఆమోదింపజేసుకున్నారని ఆరోపించారు. ముగ్గురమే రాష్ట్రపతిని కలిసినా కోట్లమంది సంతకాలను తీసుకెళ్లామన్నారు. చట్టాలను ప్రధాని వెనక్కితీసుకోకపోతే దేశం ఇబ్బందుల్లో పడుతుందని పేర్కొన్నారు. ప్రధాని రైతుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు,ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగంపైనే కోట్లమంది ఉపాధి ఆధారపడి ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలో పెనువిధ్వంసానికి దారితీసే నిర్ణయాలు తీసుకుంటున్నారని రాహుల్ ద్వజమెత్తారు. మోడీ నిర్ణయాలు కోట్లమంది జీవితాలు రోడ్డున పడేసి, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలమందిని కరోనా బలి తీసుకున్నా ప్రధాని ఏమీ చేయలేకపోయారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై గళమెత్తే వారిని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. సరిహద్దుల్లో చైనా వేల కిలోమీటర్లు ఆక్రమించుకుంటే మౌనమెందుకు? అని ప్రశ్నించారు. దేశం ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తోందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఊహల్లోనే ఉంది.. వాస్తవంలో లేదని రాహుల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News