Sunday, April 28, 2024

మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి కట్టాల్సిందే

- Advertisement -
- Advertisement -

pay Rs 1000 fine if caught without mask

హైదరాబాద్: మాస్కులు పెట్టుకోకుండా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు గత మూడు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్కు, హెల్మెట్ లేకుండా బైక్‌పై తిరుగుతున్న వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. మాస్కులు లేని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. నగరంలో అమలులో ఉన్న ఇంటెలిజెన్సీ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం సహకారంతో వీరిని గుర్తించి ఆన్‌లైన్ ద్వారా చలాన్లు విధించి వాహనదారులకు పంపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఆటోమెటిక్ ఈ కెమెరాలు గుర్తిస్తాయి.

ఈ కెమెరాల పర్యవేక్షణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉంటుంది. గతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించే వారు ఇప్పుడు దీనిని మాస్కులు పెట్టుకోని వారిని గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుడి మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపిస్తున్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని రోజుకు 10 నుంచి 15 మంది మాస్కులు లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఇన్స్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

pay Rs 1000 fine if caught without mask

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News