Saturday, April 27, 2024

కరీంనగర్‌లో ఏ పని ప్రారంభించిన విజయమే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఏ పని ప్రారంభించిన కరీంనగర్‌లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్‌లో ఐటి టవర్ ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌లో ఏ పని ప్రారంభించిన తప్పకుండా విజయవంతమవుతోందని కొనియాడారు. పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోందని, 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని తెలియజేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతా లేకుండా చేశామని, సిఎం కెసిఆర్ నాయకత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టి పెట్టామని, ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.

దేశానికి తెలంగాణ ధాన్యభాండాగారంగా మారిందన్నారు. నీటి పారుదల శాఖను జలవనరుల శాఖగా మార్చామని, తెలంగాణలో గ్రామీణ జీవితాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. తాగు, సాగు నీరు, విద్యుత్ ఇబ్బందులకు తక్కువ కాలంలో అధిగమించామని, మూడేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని, భవిష్యత్ తరాలు బాగుండాలని 230 కోట్ల మొక్కలు నాటాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో తీగల వంతెనను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. కరీంనగర్‌కు కొత్త శోభను తీసుకొచ్చేలా జంక్షన్ రూపొందించాలని, కరీంనగర్‌లో ఇప్పటికే రూపాయికే నల్ల కనెక్షన్ కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. తెల్ల కార్డు ఉన్న వారికి రూపాయికే నల్ల కనెక్షన్ ఇస్తున్నామని, కరీంనగర్‌లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టి హబ్ ప్రాంతీయ కేంద్రం కరీంనగర్‌లో ఏర్పాటు కాబోతుందని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇతర దేశాల్లో స్థిరపడిన వారికి మంచి అవకాశం ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News