Sunday, April 28, 2024

ఫైటర్ పైలెట్‌గా పాయల్

- Advertisement -
- Advertisement -

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో సంచలనం సృష్టించి ‘వెంకీమామ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ పాయల్ రాజ్‌పుత్. ఆమె ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తాజా మూవీ ‘నరేంద్ర’లో ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ ఫైటర్ పైలెట్‌గా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోంది. ఒక అమాయకుడైన భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు? అక్కడి నుండి ఎలా తప్పించుకుని బయట పడ్డాడు? అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హీరోగా పరిచయం అవుతున్న నీలేష్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా మానవ హక్కుల కార్యకర్త పాత్ర పోషిస్తోంది. అలాగే ఆఫ్ఘన్ ఖైదీగా ఫేమస్ డబ్లుడబ్లుఈ స్టార్ ద గ్రేట్ ఖలి నటిస్తున్నారు.

Payal Rajput plays special role in Narendra movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News