Monday, April 29, 2024

కోటీశ్వరి కౌశల్య కార్తీక

- Advertisement -
- Advertisement -

Special Challenged

 

మీలో ఎవరు కోటీశ్వరి షోలో కౌశల్య కార్తీక పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొంది. మాట్లాడలేని, వినలేని కౌశల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో, జూనియర్ అసిస్టెంట్ ప్లస్ టూ వరకు, నాగర్ కోయిల్‌లోని బధిరుల పాఠశాలలో చదివిన కౌశల్య ఎంబిఏలో కూడా గోల్డ్ మెడలిస్ట్. ఈమె మొట్ట మొదటి స్పెషల్ ఛాలెంజెడ్ మహిళ కంటెస్టెంట్. తమిళనాడులోని మదురైలో జన్మించిన కౌశల్య సినీనటి రాధిక నిర్వహిస్తున్న షోలో, రాధిక అడిగిన ప్రశ్నలు లిప్ రీడింగ్ ద్వారా అర్థం చేసుకొని సమాధానాలు అందించింది. తమిళం మాతృభాష కావటంతో ఇంటర్‌లో చేరేవరకు ఆమెకు ఇంగ్లీష్ అవసరం రాలేదు. కనీసం ఎబిసిడిలు కూడా రావు. మదురై కళాశాలలో చేరి ఇంగ్లీష్ నేర్చుకుంది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

సమాజంలో ఎవరూ ఒంటరికాదు

మానసిక రుగ్మతతో బాధపడే వాళ్లకోసం లివ్, లవ్, లాఫ్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసింది నటి దీపిక పదుకొనే. దీపిక చేస్తున్న కృషికి గుర్తింపుగా దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో క్రిష్టల్ అవార్డు అందుకుంది. పేద హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకున్న దీపిక మాట్లాడుతూ.. మానసిక కుంగుబాటుకు లోనైన వాళ్లు ఒంటరివాళ్లు కారు. సమాజంలో వారిపట్ల ఉండే అభిప్రాయం మార్చాలి. ఒక్క ప్రాణాన్నయినా కాపాడాలనే లక్ష్యంతో నేను సంస్థను ఏర్పాటు చేశానని చెబుతోంది దీపిక.

దయ చూపొద్దు

సంవత్సరం వయసులోనే కండరాల వ్యాధితో చక్రాల కుర్చీకే పరిమితం అయిన చాందినీ నాయే ఇవ్వాళ పేరున్న సెలబ్రెటీ అయింది. కేరళకు చెందిన చాందినీ డాక్టర్ కావాలనుకుంది. బెంగుళూరులోని ఆక్స్‌ఫర్డ్ కాలేజిలో బిఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నటించటం ఇష్టమే కానీ చక్రాల కుర్చీలో కూర్చుని డబ్‌స్మాష్‌తో సినిమా స్టార్ల డైలాగ్స్ అనుకరిస్తూ వీడియోలు చేసింది. వెరైటీ మీడియా ఫేస్‌బుక్ పేజీలో ఈమె చేసిన వీడియోలకు 60లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఓ పక్క చదువు ఇంకోపక్క టిక్‌టాక్ వీడియోలతో తీరిక లేకుండా ఉండే చాందినీ ఎక్కడా వీల్ చైర్‌లో ఉన్నానని బయట పెట్టదు. దయతో వచ్చే లైక్‌లు నాకు అక్కర్లే దంటోంది. 200 పైగా చేసిన టిక్ టాక్ వీడియోలకు లక్షల కొద్దీ వీక్షకులున్నారు.

Special Challenged Woman Karthika
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News