Friday, May 3, 2024

కుదేలైన పేటిఎం షేరు!

- Advertisement -
- Advertisement -

RBI bans Paytm...
ముంబయి: కొత్త ఖాతాలు తెరువొద్దంటూ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్‌బిఐ ఆదేశించడంతో ఆ కంపెనీ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఓ దశలో 13 శాతానికి పైగా కుంగి రూ. 672 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని(లైఫ్‌టైమ్ మినిమం) తాకింది.  మోర్గాన్ స్టాన్టీ ’ఓవర్ వెయిట్ నుంచి అండర్ వెయిట్‘కు దీన్నీ కుదించింది.  ఇష్యూ ధరతో పోలిస్తే ఈ స్టాక్ ఇప్పటి వరకు 70 శాతం వరకు కుదించుకుపోయింది. పేటిఎం బ్యాంక్‌లో కొన్ని పర్యవేక్షణ లోపాలు గుర్తించిన ఆర్‌బిఐ తాజా నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని 35ఎ సెక్షన్ కింద కొత్త ఖాతాలు తెరవడాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా పేటిఎంను ఆర్‌బిఐ ఆదేశించింది. 2016లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటయింది. పేటిఎం ఆర్‌బిఐ ఆంక్షలు ఎదుర్కోవడం ఇది మూడోసారి. కొత్త ఖాతాలు ప్రారంభించవద్దనడం రెండోసారి. పేటిఎంలో వ్యవస్థాపకుడు శేఖర్ శర్మకు 51 శాతం వాటా ఉండగా, మిగతా వాటా వన్97 కమ్యూనికేషన్స్‌కు ఉంది. కాగా ఆర్‌బిఐ ఆదేశాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత వినియోగదారులు బ్యాంకింగ్ సేవలన్నింటినీ ఉపయోగించుకోవచ్చని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News