Friday, May 3, 2024

గంజాయిపై ఉక్కుపాదం…

- Advertisement -
- Advertisement -

విక్రేతలపై నగర పోలీసుల నజర్
గంజాయి లేకుండా చేయాలని చర్యలు
అవగాహన కార్యక్రమాలు నిర్వహణ
24మందిపై పిడి యాక్ట్

PD act on cannabis sale persons

మనతెలంగాణ, సిటిబ్యూరో: నగరంలో గంజాయి లేకుండా చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. రోజు రోజుకు నగరంలో గంజాయి విచ్చల విడిగా విక్రయిస్తున్నారు. దీంతో చాలామంది యువకులు తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడ గంజాయి విక్రయం జరుగుతోంది. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది విస్కృతంగా దాడులు చేసి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపిస్తున్నా బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అదే వ్యాపారం చేస్తున్నారు. గతంలో గంజాయి కేవలం ధూల్‌పేటలో మాత్రమే విక్రయించేవారు. కాన్ని ఇప్పుడు నగరంలోని అన్ని ప్రాంతాలు గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. డబ్బులు ఇస్తే చాలు ఎక్కడ కావాలంటే అక్కడ గంజాయి లభిస్తోంది. చాలామంది విద్యార్థులు, యువకులు గంజాయికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ముందుగా గంజాయి తీసుకోవడానికి అలవాటుపడిన యువకులు, విద్యార్థులు తాము విక్రయించడం ప్రారంభిస్తున్నారు. ఇలా చాలామంది విద్యార్థులు గంజాయి విక్రయిస్తు పోలీసులకు పట్టుబడుతున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలుగా మారుతున్నారు. కరీంనగర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు నగరంలోని కాచిగూడలో ఉంటూ డిగ్రీ చేస్తున్నారు. నగరంలోని రూము తీసుకుని ఉండడంతో ఎవరి నిఘా లేకుండా పోయింది. గంజాయి తీసుకోవడానికి అలవాటు పడిన ఇద్దరు విద్యార్థులు తర్వాత తక్కువ రూ.300కు గంజాయి కొనుగోలు చేసి రూ. 1,500లకు విక్రయించడం ప్రారంభించారు. పోలీసులు పట్టుకుని అరెస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. చాలామంది విద్యార్థులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయానికి మొగ్గుచూపుతున్నారు. ఒంగోలుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి గతంలో భారీ ఎత్తున గంజాయి విశాఖపట్టనం నుంచి కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వస్తుండగా రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

నశాముక్త హైదరాబాద్…

నగరంలోని ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ధూల్‌పేటలో లభిస్తున్నాయి. దీంతో వెస్ట్‌జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నశాముక్త హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించడం వల్ల ఎలా జీవితం నాశనం అవుతుందో ధూల్‌పేట వాసులకు వివరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్థానికులతో మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని వారిని కోరారు. ధూల్‌పేట యువకులకు అవసరమైన సాయం అందజేస్తామని తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం…

గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా గంజాయి, హాష్ ఆయిల్, డ్రగ్స్ విక్రయిస్తుండడంతో వారిపై పిడి యాక్ట్ పెట్టి బయటికి రాకుండా చేస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్న ధూల్‌పేటకు చెందిన 24 మందిపై పిడి యాక్ట్ పెడుతూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో గంజాయి విక్రేతలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. రానున్న రోజుల్లో గంజాయి విక్రయించే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News