Saturday, May 18, 2024

వాకింగ్ చేస్తుండగా యువకుడిపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Rape on young man in karnataka

బెంగళూరు: కామంతో రగిలిపోయేవారు ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవర్నీ వదిలిపెట్టడంలేదు. తాజాగా ఓ యువకుడిపై మరో వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెల్గామ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కబాక గ్రామానికి చెందిన యువకుడు ప్రతీ రోజు వాకింగ్ చేస్తాడు. శుక్రవారం సాయంత్రం వాకింగ్ కోసం రోడ్డుపైకి వెళ్లాడు. అక్కడ పరిచయం ఉన్న వ్యక్తి మొహ్మద్ హానీఫ్ కనిపించాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. చెరుకు రసం తాగుదామని కొంత దూరం తీసుకెళ్లాక చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అక్కడ యువకుడిపై హానీఫ్ అత్యాచారం చేశాడు. వెంటనే భయంతో సదరు యువకుడు ఇంటికెళ్లాడు. దుస్తువులకు బురద మరకలు ఉండడంతో తండ్రి ఏమైందని అడిగాడు. జరిగిన విషయం చెప్పడంతో వెంటనే తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు హనీఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News