Sunday, May 5, 2024

ఆయిల్ ట్యాంకర్ల ఆకస్మిక సమ్మెతో జనం బెంబేలు

- Advertisement -
- Advertisement -

పెట్రోలు కోసం వాహనదారుల ఉరుకులు… పరుగులు
పెట్రోల్ బంకుల వద్ద పోటెత్తిన వాహనాలు
హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
జిల్లాల్లోనూ పెట్రోల్, డీజిల్ కోసం తప్పని తిప్పలు
ఎట్టకేలకు సమ్మె విరమణ… ఉపిరి పీల్చుకున్న వాహనదారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్ డ్రైవర్లు నిన్నటి నుండి ఆకస్మిక సమ్మెకు దిగారు. ఆయిల్ కంపెనీల వద్ద ఎక్కడి ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. తెలంగాణలోనూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దగడంతో రాష్ట్రంలో వాహనదారులు చుక్కలు చవిచూశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం ఉరుకులు పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం నుంచే డ్రైవర్లు ఆదయిల్ ట్యాంకర్స్ నిలిపివేశారు. దీంతో మంగళ వారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. మరో రెండు రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెట్రోల్ బంకుల దారిపట్టాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులకు వాహనదారులు పొటెత్తారు.

మధ్యాహ్నం నుంచే పెట్రోల్ బంకుల మందు వాహనాలు బారులు తీరడంతో ట్రాపిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని బంకులను యాజమాన్యాలు మూసివేశాయి. సమ్మె ఎన్ని రోజులు ఉంటుందోనని పెట్రోలు స్టాక్ చేసుకుండామని చాలా మంది పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రజలు నగరంలోనే ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో పెట్రోల్ బంకుకు ఒకే ట్యాంకర్ రావడంతో పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన వాహనదారుల్లో కనిపించింది. బంకుల్లో ఆన్‌లైన్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు పేమెంట్ ను బంకు యజమానులు అనుమతించలేదు. క్యాష్ ఉంటేనే పెట్రోల్ అని స్ఫష్టం చేయడంతో చాలా మంది క్యాష్ కోసం ఇబ్బంది పడ్డారు.

బంకుల వద్ద పోలీసు బందోబస్తు కనిపించింది. నగర శివారుల్లో పెట్రోబంకుల్లో వారులు తీరిన వాహనాలు కనినిపించాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, ఉప్పర్‌పల్లిలోని బంకుల్లో రద్దీ భారిగా పెరిగింది. కాగా మంగళవారం సాయంత్రానికి ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ ట్యాంకర్లు లోడింగ్‌తో బయలు దేరాయి సిటిలోకి రాత్రికి పెట్రోల్ అందుబాటులోకి రానుంది. జిల్లాల్లో బుధవారం అందుబాటులోకి రానుంది. పెట్రోల్,డీజిల్ సరఫరా యధావిగా జరిగే అవకాశం ఉంది. వాహనదారులకు ఈ వార్త ఉపశమనం కలిగించింది. కాగా ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ నేతలు మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరుకుని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తో సమావేశం అవుతున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన భారత న్యాయ సంహిత హిట్ అండ్ రన్ కేసుల్లో పెంచిన శిక్ష, జరిమానా విధింపులపై అభ్యంతరం తెలుపనున్నారు.

చట్ట సవరణ బిల్లును పరిశీలించిన తర్వాతే తదుపరి కార్యాచరణ
కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు తో డ్రైవర్లు నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ నిలిపివేశారని పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ట్యాంకర్స్ డ్రైవర్స్ ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. డ్రైవర్లు వాహనాలు నిలిపివేయడంతో గంధరగోళం ఏర్పడిందని, కేంద్రం తెచ్చిన చట్ట సవరణ బిల్లు విధి విధానాలు ఏంటనేది స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. వాహనదారులను డ్రైవర్స్ అసోసియేషన్ ఇబ్బంది పెట్టదని అన్నారు. చట్ట సవరణ బిల్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణకు పూనుకుంటామన్నారు.

Traffic Jam 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News