Tuesday, April 30, 2024

రూ.100 కోట్లు దాటిన పవన్ సినిమా ఉందా?: పేర్ని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆరు నెలల ఒకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్డు పైకి వస్తున్నారని, జనం కోసం పట్టుమని పది రోజులు పవన్ పని చేశాడా? అని వైసిపి నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాడితే దాడి చేశారని, చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నప్పుడు ముద్రగడ కుటుంబాన్ని హింసించారని మండిపడ్డారు. అప్పుడు పవన్ ఎందుకు నోటికి తాళం వేసుకున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబులా కాపులను మోసం చేయనని సిఎం జగన్ మోహన్ రెడ్డి ముందే చెప్పారన్నారు. సుప్రీం కోర్టుకు తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని నిజాయితీగా చెప్పారని, కాపులను దగా చేసింది చంద్రబాబు, పవన్ కాదా? అని అడిగారు.

Also Read: సిఎం సీటెవరిది

కాపులను పవన్ కల్యాణ్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. భీమ్లా నాయక్ సినిమాకు ఎపిలో నష్టాలు వచ్చాయా?… ఆ సినిమా ఖర్చెంత? అని చురకలంటించారు. వంద కోట్ల మార్కెట్ లేనప్పుడు రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుందని పేర్ని నాని నిలదీశారు. రూ.100 కోట్లు దాటిన పవన్ సినిమా ఏదైనా ఉందా?… డబ్బింగ్, కాపీ సినిమాలు తీస్తే ఎవరు చూస్తారని అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కాదా?… కుల ప్రస్తావన లేకుండా ఒక్క రోజైనా పవన్ మాట్లాడారా? అని పేర్ని నాని దుమ్మెత్తిపోశారు. టిడిపి నేతలు పవన్ గురించి బరితెగించి మాట్లాడితే ఏం చేశావ్ అని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News