Sunday, May 5, 2024

నన్ను ఇండియాలోనే ఉండనివ్వండి: సీమా హైదర్

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ నోయిడా: తాను భారత్‌లో నివసించడానికి అనుమతించాలనిభారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. గేమింగ్ యాప్ పబ్జీ ద్వారా పరిచయమైన గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకునేందుకు తన నలుగురు పిల్లలతో కలసి పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌ను పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. గత సోమ, మంగళవారాలలో ఆమెను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు చెందిన యాంటీ టెర్రరి స్కాడ్ ప్రశ్నించింది.

సచిన్‌తో కలసి ఇండియాలో నివసించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించింది. తనను పాకిస్తాన్‌కుతిరిగి పంపించేస్తే తనను రాళ్లతో కొట్టి అక్కడ చంపేస్తారని ఆమె శుక్రవారం ప్రధాని మోడీకి, సిఎం యోగికి విన్నవించింది. తన సోదరుడు 2022లో పాకిస్తానీ సైన్యంలో చాలా దిగువ శ్రేణి ర్యాంకులో చేరాడని ఆమె తెలిపింది.

నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో తనకు వివాహమైనట్లు ఆమె తెలియచేయగా ఆ ఆలయంలో వివాహాలు జరగవని ఆలయ పాలనా యంత్రాంగం తెలిపింది. వేరే గత్యంతరం లేక తాను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించానని, పాకిస్తాన్‌లో తాను బతకదలుచుకోలేదని ఆమె చెప్పింది. తాను భారత్‌కు వెళుతున్నట్లు పాక్‌లో ఎవరికైనా తెలిస్తే తనను చంపేసేవారని ఆమె తెలిపింది. తాను పాకిస్తానీ ఏజెంట్‌ను కానని ఆమె తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News