Saturday, May 4, 2024

నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధులు

- Advertisement -
- Advertisement -
PM Kisan funds to farmers' accounts today
9.5కోట్ల మందికి రూ.19వేల కోట్లు

హైదరాబాద్ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడి శుక్రవారం ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సిఎం కిసాన్ పథకం ప్రారంభమయ్యాక ఎనిమిదవ విడతగా నిధులు విడుదుల కానున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ రంగానికి పెట్టుబడి సాయంకింద రూ.19వేల కోట్లను ఈ పథకానికి అర్హత పొందిన లబ్ధిదారులుగా ఎంపికైన 9.5కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమచేయనున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రైతు కుటుంబాలకు రూ.6000 మూడు విడతలుగా విడతకు రూ.2వేలు చొప్పున అందచేస్తోంది. పికి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకూ ఈ పథం కింద రూ.1.15లక్షల కోట్లు రైతుల కుటుంబాలకు అందించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News