Tuesday, April 30, 2024

లాక్‌డౌన్ పరిస్థితి తెచ్చుకోవద్దు

- Advertisement -
- Advertisement -

PM Modi address to the Nation on Corona situation

కరోనా రెండో దశ తుఫానులా విరుచుకుపడుతోంది
దేశంలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాలి
లాక్‌డౌన్ నుంచి కాపాడుకోవాలి
చివరి అస్త్రంగానే రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రయోగించాలి
ఆక్సిజన్ సరఫరాకు అనేక చర్యలు తీసుకుంటున్నాం
వైద్యులకు నా సెల్యూట్: జాతినుద్దేశించి ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కొన్ని వారాలుగా కరోనా సెకండ్ వేవ్ దూసుకు వచ్చిందని, తుపానులా విరుచుకు పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ఆయ న ప్రసంగించారు. దేశాన్ని లాక్‌డౌన్‌నుంచి మనకు మనమే కాపాడుకోవాలన్నారు. రాష్ట్రాలు తాక్‌డౌన్‌ను చివరి అస్తరంగా మాత్రమే పరిగణించాలని ప్రధాని విజ్ఞప్తిచేశారు. అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉంద ని, సరిపడా ఆక్సిజన్ సరఫరా కోసం అధిగమించడానికి కృషి చేస్తున్నామని, అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్‌ను అందించే దిశగా పని చేస్తున్నామన్నారు. ‘కొన్నాళ్లుగా వైరస్‌పై కఠినమైన పోరాటం చేస్తున్నాం. రెండో దశలో కరోనా మరింత కఠినమైన సవాలును విసురుతోంది. మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా.. అందరూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా సం క్షోభంనుంచి మనం తప్పక బైటపడాలి.

దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వైద్యులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. ధైర్యంగా ఉంటేనే కఠిన పరిస్థితులను ఎదుర్కోగలం. ఇటీవల మనం తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తులో పరిస్థితిని చక్కదిద్దగలవు. ప్ర పంచంలో ప్రఖ్యాతిగాంచిన ఔషధ సంస్థలు భారత్‌లో ఉన్నాయి. కరోనా దశలో ఔషధాల కొరత లేదు. ఆక్సిజన్ డిమాండ్ దేశంలోని చాలా ప్రాంతా ల్లో పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందు కు కృషి చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచేందు కు కృషి చేస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉంటే లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉండదు. మైక్రో కంటైన్‌మెంట్ జోన్లపై దృష్టిపెట్టండి. అవసరమైన సమయంలో సహకారం అందిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు. ఉచిత వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతోంది.ప్రపంచంలోనేఅత్యంతచౌకగా మన దేశ వ్యాక్సిన్‌అందిస్తోంది’ అని ప్రధాని అన్నారు.
అనవసరంగా బైట తిరగొద్దు
అవసరమైతేనే ప్రజలు బైటికి వెళ్లాలని ప్రధాని సూచించారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు 12 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశామన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్, వయోవృద్ధులకు టీకాలు వేశామని, మే 1నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలు వేస్తే నగరాల్లో పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నగరాల్లో పని చేస్తున్న జనాభాలో 18 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కరోనాపై పోరులో రాష్ట్రాల సహకారం ఎంతో బాగుందని ప్రధాని కితాబు ఇచ్చారు.

PM Modi address to nation on Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News