Thursday, May 16, 2024

కెసిఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కెసిఆర్‌గా పిలువబడే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం 69వ జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తర్వాత దానిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బిజెపిని ఎదుర్కొనేందుకు అనేక ప్రతిపక్షాలను కలుపుకుపోయేందుకే ఆయన బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. కాగా ప్రధాని మోడీ ‘తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘ కాల ఆయురారోగ్యాల కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News