Wednesday, May 1, 2024

డిజిటల్ లావాదేవీలు భారత్ లోనే అధికం… బ్రిక్స్ సదస్సులో మోడీ

- Advertisement -
- Advertisement -

జొహన్నెస్ బర్గ్ : భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి దక్షిణాఫ్రికాలో నిర్వహించిన బ్రిక్స్ సదస్సులో దేశ ప్రధాని మోడీ మాట్లాడారు. రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించనుందని తెలిపారు. 2047నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే దేశ ప్రజల సంకల్పమని చెప్పారు. పదో వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్‌ను అభినందించారు. పదేళ్లుగా ఆర్థిక సహకారాన్ని అందించటంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ పాత్ర కీలకమైనదని తెలిపారు.

అనంతరం యూపీఐ సేవల గురించి కొనియాడారు. ప్రస్తుతం సింగిల్ క్లిక్ విధానంతో పెద్ద సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో లావాదేవీల్లో పారదర్శకత పెరిగి, మధ్యవర్తిత్వం, అవినీతి తగ్గుముఖం పట్టింది. చిన్న దుకాణం నడిపే వారి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ నిర్వహించే వారి వరకు అందరూ యూపీఐ సేవల్ని వినియోగిస్తున్నారు.

ప్రపంచ దేశాలన్నిటిలో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తోన్న దేశం భారత్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ , ఫ్రాన్స్ దేశాలు కూడా ఈ సేవల్ని అందిపుచ్చుకోనున్నాయి. అంటూ యూపీఐ విస్తరణ గురించి తెలిపారు. బ్రిక్స్ లోని దేశాలు కూడా ఈ సేవలు వినియోగించే అవకాశాలు ఉన్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News