Saturday, April 27, 2024

టీకా తయారీదారులతో ప్రధాని సమావేశం

- Advertisement -
- Advertisement -
PM Modi meets with Covid vaccine manufacturers
వ్యాక్సిన్ పరిశోధనపై చర్చ

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు కొవిడ్ వాక్సిన్ తయారీ సంస్థలతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమావేశమైనారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, జైడస్ క్యాడిల్లా, బయోలాజికల్ ఇ, జెనోవా బయో ఫార్మా, పానాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులలు ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, ఆ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యాక్సిన్ పరిశోధనను ముమ్మరం చేయడంతో సహా పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. దేశంలో టీకా పంపిణీ వంద కోట్ల మైలురాయిని దాటిన రెండు రోజుల తర్వాత ఈ సమావేశం జరగడం గమనార్హం.

ఈ నెల 21న దేశంలో వ్యాక్సినేషన్ వంద కోట్ల మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 75 శాతానికి పైగా అర్హులైన వయోజనులకు తొలి డోసు పూర్తవ్వగా.. 31 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో సీరమ్ సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌తో పాటుగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక జైడస్ క్యాడిల్లా రూపొందించిన జైకోవ్‌డి వ్యాక్సిన్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు బయోలాజికల్‌ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ టీకాకు అనుమతులు మంజూరు చేయనప్పటికీ ఇప్పటికే 30 కోట్ల డోసులకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News