Monday, May 6, 2024

రజకం సాధించిన మీరాబాయికి ప్రధాని ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

PM Modi wishes Olympic silver medalist Mirabai

 

టోక్యో ఒలింపిక్స్ లో రజకం సాధించిన మీరాబాయిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఒలింపిక్స్ లో భారత్ కు గొప్ప శుభారంభం అన్నారు. మీరాబాయి గెలుపు ప్రతి భారతీయునికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని కొనియాడారు. అటు భారత్ కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని, రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్ లో ఖాతా తెరిచిన మీరాబాయికు హృదయపూర్వక శుభాకాంక్షలు అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందించారు. ‘‘ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. మీరాబాయి ప్రదర్శనతో దేశమంతా ఉప్పొంగిపోతోంది. వెయిట్ లిఫ్టింగ్ లో దేశానికి రజత పతకం అందించిన ఆమెకు శుభాకాంక్షలు. ఆమె విజయం భారతీయులందరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

PM Modi wishes Olympic silver medalist Mirabai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News