Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిఎం కెసిఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా ప్రధాని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సిఎం కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఎం కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, కర్ణాటక సిఎం యడియూరప్ప, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్,ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం ముఖ్యమంత్రులు భూపేశ్, ప్రేమ్‌సింగ్, త్రిపుర సిఎం బిప్లవ్‌దేవ్ కుమార్, డిఎంకె అధినేత స్టాలిన్, టిడిపి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ, అభిమానాలు కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.
కెటిఆర్, హరీశ్, కవిత శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేసేందుకు అన్ని అవరోధాలను ఎదురించిన పోరాడిన ధీరుడాయన అంటూ టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్, ఐటి, పురపాలక శాఖ మంత్రి, సిఎం కెసిఆర్ తనయుడు కె.టి.రామారావు ట్వీట్ చేశారు. ప్రేరణాత్మక ఉద్యమాలతో అసాధారణ నేతగా ఆవిర్భవించిన వ్యక్తి…ఇప్పుడు అద్భుతమైన పరిపాలకుడు ఉన్న ఆ అపూర్వమైన వ్యక్తిని నాన్న అని సగర్వంగా పిలుస్తానంటూ సిఎం కెసిఆర్ ట్విట్టర్ వేదికగా కెటిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ తన మనవరాలు అలేఖ్యతో కలిసి దిగిన ఫొటోను మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు సిఎం కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరిందని అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తలెంగాణ తలరాత మారింది…మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది..గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నదని పేర్కొన్నారు. ‘నా జన్మదాత, నిత్య స్పూర్తి ప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఎంఎల్‌సి కవిత ట్వీట్ చేశారు.
కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సిఎం జగన్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్ధిస్తున్నాను’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే టిడిపి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఎపి మాజీ మంత్రి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిఎం కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన సినీప్రముఖులు
ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రముఖ సినీహీరో మహేష్ బాబు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రముఖ సినీ హీరో విజయ్ దేవరకొండ, హీరో నితిన్, ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపుడి, నటుడు సుధీర్‌బాబు, ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, దియా కుమారి, సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ తదితరులు ట్విట్టర్ వేదికగా సిఎం కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi wishes to CM KCR on his birth day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News