Sunday, April 28, 2024

పార్టీ ఫర్ ది ఫ్యామిలీ.. పార్టీ బై ది ఫ్యామిలీ

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi Dig At Congress

కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం
కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శ
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు
కార్యక్రమాన్ని బహిష్కరించిన విపక్షాలు

న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు హాజరయ్యారు. కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుబట్టిన ఆయన ‘పార్టీ ఫర్ ది ఫ్యామిలీ.. పార్టీ బై ది ఫ్యామిలీ’ అన్నట్లుగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా అంతకన్నా ఎక్కు చెప్పడం తనకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఒకే పార్టీ దేశాన్నిపాలించడం కానీ, ఒక జాతీయ పార్టీ తరతరాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉంటే అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామమ్యానికి సమస్యగా మారుతుందన్నారు. ‘ ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ సభకు సెల్యూట్ చేస్త్తున్నాం.

ఇక్కడే భారత్‌కు చెందిన నేతలు మనకు రాజ్యాంగాన్ని అందించడం కోసం కృషి చేశారు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. విభిన్న సంస్కృతులతో అలరారుతున్న భారత్‌ను ఈ రాజ్యాంగం ఒక్కటిగా పట్టి ఉంచుతుంది. అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారు. రాజ్యాంగ దినోత్సవం ప్రారంభించినప్పుడు చాలా మంది ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేక పోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం చాలా కష్టం. పార్టీలు కుటుంబాల పరం అవుతున్నాయి. కుటుంబాల ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడలేవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడం అవసరం ఉంది. అవినీతిని రాజ్యాంగం అనుమతించదు. ఇదే రోజున ముంబయి మారణ హోమం జరిగింది. ఉగ్రమూకలతో పోరాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని ప్రధాని అన్నారు.

ప్రజా సంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలి: వెంకయ్య

అంతకు ముందు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్షమని అన్నారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషించిందన్నారు. రాజ్యాంగ రూపకర్తలకు నివాళులర్పిస్తున్నానన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26 చారిత్రక దినమన్నారు. ప్రజాస్వామ్య దేశతత్వాన్ని రాజ్యాంగ పీఠిక ప్రతిబింబించిందని చెప్పారు. ప్రజాసంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే.. ఒకరి కోసం అందరం ఉన్నామన్నారు. సవాళ్లకు అనుగుణంగా మార్చుకునే స్వభావం మన రాజ్యాంగానికి ఉందన్నారు. సురక్షిత, సుశిక్షిత, స్వాస్థ భారత్ మనందరి లక్షం కావాలన్నారు.

ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో పార్లమెంటు కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలగడం పట్ల రాజ్యసభ చైర్మన్‌కూడా అయిన వెంకయ్య ఆందోళన వ్యక్తం చేస్తే, ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పునుగౌరవించాలన్నారు. తొలుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఆయనతో పాటుగా కార్యక్రమానికి హాజరైన అందరూ రాజ్యాంగ పీఠికను పఠించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాజ్యాంగ సభ చర్చల డిజిటల్ వెర్షన్‌ను విడుదల చేశారు. అలాగే రాజ్యాంగం, ఇప్పటిదాకా రాజ్యాంగానికి చేసిన అన్ని సవరణలతో కూడిన తాజా ప్రతులని కూడా రాష్ట్రపతి విడుదల చేశారు. అలాగే ‘రాజ్యాంగ ప్రజాస్వామ్యం’పై ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ క్విజ్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

విపక్షాలు దూరం

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా 14 విపక్ష పార్టీలు ఈ రాజ్యాంగ దినోత్సవానికి గైరుహాజరయ్యారు. వచ్చేవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పార్టీలు ఐక్యతను చాటాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. వారు రాజ్యాంగం ప్రకారం పాలించడం లేదు. కానీ వారు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలంటున్నారు. ఇదో ప్రచార కార్యక్రమం’ అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News